Breaking News

బీచ్ అటాక్.. ఉగ్రవాది తల్లి సంచలన విషయాలు

Published on Mon, 12/15/2025 - 15:52

ఆస్ట్రేలియా బీచ్‌లో  ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది అమాయక ప్రజలను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి ఆసక్తికర విషయాలు తెలిపింది. కాల్పులు జరిపే కొద్ది సేపటి ముందు తన కుమారుడితో ఫోన్‌  మాట్లాడినట్లు పేర్కొంది. తన కుమారుడు తనతో ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడాడని కొద్దిసేపటి తర్వాత తినడానికి వెళ్తానన్నాడని తెలిపింది.

ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని కొద్దికాలం క్రితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. ‍అయితే తాజాగా ఈకాల్పుల ఘటనపై ఉగ్రవాది నవీద్ అక్రమ్ తల్లి స్పందించింది. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే అక్రమ్ తనతో మాట్లాడరని తెలిపింది.

ఉగ్రవాది తల్లి వెరినా మాట్లాడుతూ "ఘటన జరగడానికి కొద్ది సేపు మందు నా కొడుకుతో మాట్లాడా అక్రమ్ చాలా సాధారణంగా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే స్కూబా డ్రైవింగ్‌కు, స్విమ్మింగ్‌కు వెళ్లివచ్చాను. ఈ రోజు చాలా వేడిగా ఉంది హోటల్‌లోనే ఉంటాను. కొద్దిసేపు తర్వాత తింటాను " అని అక్రమ్ అన్నారని తన తల్లి పేర్కొంది. తన కొడుకు చాలా మంచివాడని అతనికి ఏలాంటి దురలవాట్లు లేవని,స్నేహితులతో కూడా ఎక్కువ తిరగడని తనకు పనికి వెళ్లడం ఇంటికి రావడం తప్ప మరేది తెలియదని ఆమె అంది. ‍

అయితే తన కుమారుడి చిత్రాలను ప్రస్తుతం చూపిస్తున్న చిత్రాలతో సరిపోల్చలేమని తెలిపింది. నవీద్ అక్రమ్ సిడ్నీలోని హెకెన్‌బర్గ్- అల్- మురాద్‌ ఇనిస్టిట్యుూట్‌లో ఖురాన్ సంబంధింత అధ్యయనాలని పూర్తి చేశాడు. 2024లో అక్కడే ఒక గృహాన్ని కొనుగోలు చేశాడు. ఇటీవల తన పని చేస్తున్న నిర్మాణ సంస్థ దివాళా తీయడంతో అతని ఉద్యోగం పోయినట్లు అతని తల్లి తెలిపింది.  

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)