Breaking News

ఒక దారి మూసుకుపోయింది.. ఇప్పుడు ప్లాన్‌-బీ రెడీ!

Published on Wed, 07/01/2026 - 07:03

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌' నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. అయితే ట్రంప్‌ వెంటనే ప్లాన్‌-బీ అమల్లోకి తెచ్చారు. "కోర్టు అడ్డుకున్నా.. నేను ఆగను" అన్నట్లుగా కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఇంతకీ దాన్ని అధిగమించేందుకు ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించే 'బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌' (Birthright Citizenship) విధానాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్‌ ప్రయత్నాలకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పుట్టుకతోనే పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆయన పెద్ద షాకే తలిగిందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

"కోర్టు తీర్పు నిరాశ కలిగించినా.. నా దారి నాకుంది" అంటూ కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. దీంతో ట్రంప్‌ తదుపరి అడుగు ఏంటన్న దానిపై అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.

ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship)పై కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు, హక్కుల సంఘాలు కోర్టులో సవాల్‌ చేశాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ఆ ఉత్తర్వును నిలిపివేయగా.. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని సమర్థించింది.

సుప్రీంకోర్టు ఏమంది?..
ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో కీలక తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (Fourteenth Amendment) ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన దాదాపు ప్రతి వ్యక్తికీ పౌరసత్వ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అక్రమంగా లేదంటే తాత్కాలికంగా అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా చట్టాల పరిధిలోనే ఉంటారని, అందువల్ల వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ హక్కును తొలగించాలంటే కేవలం అధ్యక్ష ఉత్తర్వు సరిపోదని, రాజ్యాంగ పరమైన మార్పులు అవసరమనే విషయాన్ని కూడా తీర్పు స్పష్టం చేసింది.

ట్రంప్‌ స్పందన ఏంటి?
సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఈ తీర్పు అమెరికాకు మంచిది కాదు. కానీ దీనిని కాంగ్రెస్‌లో చట్టం ద్వారా సులభంగా సరిచేయవచ్చు. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కాంగ్రెస్‌ ఈ రోజే పని ప్రారంభించాలి. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది" అని పేర్కొన్నారు. జన్మహక్కు పౌరసత్వం వల్ల అమెరికాపై భారీ ఆర్థిక భారం పడుతోందని, ప్రస్తుత విధానం దేశానికి అన్యాయమని ఆయన మరోసారి వాదించారు.

అంతేకాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్‌ మరో సంచలన వ్యాఖ్య చేశారు. "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అభినందనలు" అంటూ వ్యంగ్యంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే ప్రస్తుత విధానం అక్రమ వలసలను, 'బర్త్‌ టూరిజం'ను ప్రోత్సహిస్తోందని ట్రంప్‌ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో చైనా సహా ఇతర దేశాల పౌరులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఏమందంటే..
సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు జరుగుతున్న 'బర్త్‌ టూరిజం' (ప్రసవం కోసం అమెరికాకు వెళ్లడం)పై చర్యలు కొనసాగుతాయని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇక ముందు ఏం జరగొచ్చు?
సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వు అమలు దాదాపు నిలిచిపోయినట్లే. అయితే జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేసేలా కాంగ్రెస్‌లో కొత్త చట్టం తీసుకురావాలని ట్రంప్‌ పట్టుదలగా ఉన్నారు. అయితే రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా అలాంటి చట్టం నిలబడుతుందా? లేదంటే మళ్లీ కోర్టుల్లోనే నిలిచిపోతుందా? అన్నది ఇప్పుడు అమెరికా రాజకీయాలు, న్యాయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)