Breaking News

ఆ కూడలికి భగత్‌ సింగ్‌ పేరు పెట్టండి: పాక్‌ కోర్టు

Published on Sat, 09/14/2024 - 08:26

లాహోర్‌: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఒక కూడలికి భారత స్వాతంత్ర్య పోరాట వీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడంలో జరుగుతున్న జాప్యంపై లాహోర్‌ హైకోర్టు అక్కడి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దీనిపై నోటీసులు జారీ చేస్తూ, సమాధానం చెప్పేందుకు చివరి అవకాశం ఇచ్చింది.

లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు పంజాబ్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును పంజాబ్‌ ప్రభుత్వం కోరింది. పాకిస్తాన్‌లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమ్స్ మహమూద్ మీర్జా విచారణ చేపట్టారు. ఈ అంశంపై స్పందించడానికి పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది సాద్ బిన్ ఘాజీ కోర్టుకు హాజరై, దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరారు.

పంజాబ్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు, ఈ అంశంపై స్పందించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఖలీద్ జమాన్ ఖాన్ కాకర్ కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు నవంబర్ 8కి వాయిదా వేసింది.

షాద్‌మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 1931లో భగత్‌సింగ్‌ను ఉరితీసిన షాద్‌మాన్ చౌక్‌కు ఆయన పేరు పెట్టాలని లాహోర్ హైకోర్టు 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఖురేషీ తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను పంజాబ్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. ఆయనను సిక్కులు, హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతగానో గౌరవిస్తారు.

ఇది కూడా చదవండి: ఎమర్జెన్సీకన్నా దారుణం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)