Breaking News

హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్‌ అతడే: నెతన్యాహు

Published on Sun, 09/29/2024 - 07:26

బీరుట్‌: హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లాను పక్కా ప్లాన్‌ ప్రకారం ఇజ్రాయెల్‌ హత్య మార్చింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతిపై ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు.

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యటన తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. హసన్‌ నస్రల్లా హత్యానంతరం ఈ ఘటనపై నెతన్యాహు మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు మాట్లాడుతూ.. నస్రల్లాను హతమార్చడం మాతో అతి ముఖ్యమైన విషయం. హిజ్బుల్లాకు చెందిన ఇతర టాప్‌ కమాండర్లను తాము చంపినా, నస్రల్లాయే మాకు అసలు టార్గెట్‌. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న ప్రణాళికకు సూత్రధారిగా అతడు వ్యవహరించాడు. అందుకే అతడినే మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. యుద్ధంలో నస్రల్లా హత్య చారిత్రక మలుపు. తన శత్రవులపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. లెబనాన్‌ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా అధినేత హసన్‌ నస్రల్లాను ఐడీఎఫ్‌ దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాలకు కొత్త చీఫ్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే, ఇరాన్‌ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిజ్బులా​ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్‌ సఫీ అల్‌ దిన్‌ ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. నస్రల్లాకు హషీమ్‌ సఫీ అల్‌ దిన్‌ బంధువు. అలాగే, హిజ్బుల్లా జిహాద్‌ కౌన్సిల్‌లోనూ సభ్యుడుగా ఉన్నాడు.

మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను తాకాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా బలమైన కోట అయిన దహియేహ్‌లో దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అలాగే, 90 మందికి పైగా గాయపడినట్టు లెబనాన్‌ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: Hassan Nasrallah: అరబ్బుల హీరో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)