Breaking News

రష్యాలో సిరియా మాజీ అధ్యక్షుడికి బిగ్‌ షాక్‌

Published on Mon, 12/23/2024 - 11:05

మాస్కో: తిరుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో కుటుంబంతో సహా పారిపోయి.. మిత్రదేశం రష్యాను ఆశ్రయించాడు మాజీ అధ్యక్షుడు  బషర్‌ అల్‌ అసద్. అయితే.. అక్కడా ఆశ్రయంలోనూ ఆయన స్థిమితంగా ఉండలేకుండా పోతున్నారని సమాచారం. ఈ క్రమంలో భార్య అస్మా రూపంలో ఆయన పెద్ద షాకే తగిలింది.

తాజాగా.. బషర్‌ భార్య అస్మా ఆయన నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.  వరుస పరిణామాలు.. పైగా రష్యాలో ఆశ్రయం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో తన స్వస్థలం లండన్‌ వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. రష్యాలో వాతావరణం తనకు ఏమాత్రం నచ్చలేదని.. తాను దేశం దాటేందుకు అనుమతివ్వాలని.. ఈ క్రమంలోనే తనకు విడాకులు మంజూరు చేయాలని..  రష్యా కోర్టులో ఆమె ఓ పిటిషన్‌ వేశారు. దేశం విడిచేందుకు తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు.

మరోవైపు.. రష్యాలో ఆశ్రయం పొందినప్పటికీ బషర్‌కు ఉపశనం కలిగే అవకాశం లేదు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండేలా ఆయనపై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన రష్యా విడిచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ అస్మా తన పిల్లలతో మాస్కో వీడేందుకే సిద్ధమైనట్లు  టర్కీ,అరబ్‌ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. 

అస్మా.. బ్రిటిష్‌-సిరియా సంతతికి చెందిన వ్యక్తి.  లండన్‌లో జన్మించిన అస్మాకు 2000లో అసద్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె సిరియాలో అడుగుపెట్టింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. 

సిరియా గత ఐదు దశాబ్దాలుగా బషర్‌ కుటుంబ పాలన గుప్పిట ఉంది. 1971 నుంచి చనిపోయేంత వరకు బషర్‌ తండ్రి హఫీజ్‌ అల్‌ అసద్‌ సిరియాను పాలించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అయిష్టంగానే డెంటల్‌ డాక్టర్‌ అయిన బషర్‌ అల్‌ అసద్‌ అధ్యక్ష పీఠం ఎక్కారు. అయితే అధికారంలోకి రాగానే నియంత పోకడలను కొనసాగించాడు బషర్‌. దీంతో ఆయన్ని గద్దె దింపేందుకు 20 ఏళ్లుగా పోరాటాలు సాగాయి. ఈ క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో 5 లక్షల మంది ప్రాణాలు పోయాయి. అయితే.. బషర్‌ విముక్త సిరియా కోసం పోరాడిన తిరుగుబాటుదారులు.. ఎట్టకేలకు ఈ నెల ప్రారంభంలో రాజధాని డమాస్కస్‌ సహా ప్రధాన నగరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారు. దీంతో ప్రాణభయంతో బషర్‌ కుటుంబ సభ్యులతో సహా రష్యాకు పారిపోయాడు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)