భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరెస్ట్

Published on Sat, 08/24/2024 - 13:40

బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని భారతదేశ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం విడిచి పారిపోవడానికి మాజీ జడ్జి షంషుద్దీన్ చౌధురి మాణిక్‌ ప్రయచారని అక్కడి మీడియా తెలిపింది. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.

కాగా అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్‌ను అతని నివాసంలో అరెస్టు చేశారు. అవామీ లీగ్‌ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారు సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. 

న్యాయశాఖ మాజీ మంత్రి అనిసుల్ హుక్, మాజీ ప్రధాని సలహాదారు సల్మాన్ ఎఫ్ రహ్మా ఢాకా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో సైనికులు వారిని అరెస్టు చేశారు. జర్నలిస్టు దంపతులు ఫర్జానా రూపా, ఆమె భర్త షకీల్ అహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు.

ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను చట్టబద్దంగా తమ దేశానికి అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండు చేస్తోంది. హసీనాపై హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు ఆమెను తమకు అప్పగించాలని తాజాగా బీఎన్‌పీ సెక్రెటరీ జనరల్‌ మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లామ్‌ ఆలంగీర్‌ డిమాండ్‌ చేశారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)