Breaking News

చొరబాటుదారులపై అమిత్‌ షా వ్యాఖ్యలు.. బంగ్లా అభ్యంతరం

Published on Tue, 09/24/2024 - 07:43

ఢాకా: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ సోమవారం ఆయన వ్యాఖ్యలపై  నిరసన తెలిపింది. అమిత్‌ షా.. బంగ్లా జాతీయులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత విచారకరమని పేర్కొంది. ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ నిరసన పత్రాన్ని అందజేశారు. ఇక.. అమిత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన బాధ, విచారాన్ని కలిగించాయని అందులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పొరుగు దేశంపై అభ్యంతరకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకుండా తమ రాజకీయ నేతలను హెచ్చరించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. పొరుగు దేశం జాతీయులకు ఇలా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం ఇరు దేశాల స్నేహపూర్వక పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తిని దెబ్బతీస్తాయని పేర్కొంది.

ఇటీవల జార్ఖండ్‌  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన బంగ్లాదేశ్‌ జాతీయులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. జార్ఖండ్‌లోకి అక్రమంగా చొరబడిన ప్రతీ బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి మరీ గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

చదవండి: శాంతి పునరుద్దరణకు భారత్‌ మద్దతు.. జెలెన్‌స్కీకి మోదీ హామీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)