బంగ్లాలో సంక్షోభానికి కారణం అతనే? ఆ దేశాధ్యక్షుడి ఆరోపణలు

Published on Mon, 02/23/2026 - 20:46

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవలే నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్‌గా వ్యవహారించిన మహ్మద్‌ యూనస్ ఆ బాధ్యతలనుంచి వైదొలిగారు. అయితే యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో అస్థిరత నెలకొనడానికి యూనస్‌ ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాకుండా అధ్యక్షుడిగా ఉన్న తనను అనధికారికంగా తొలిగించే కుట్రపన్నారని  పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో ఇంతకాలం పాటు రాజకీయ అస్థిరత నెలకొంది. షేక్ హసీనా దేశాన్ని వదలిన మెుదలు ఆ దేశంలో రాజకీయ ‍అస్థిరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితులపై ఆ దేశ అధ్యక్షుడు షహాబుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్‌గా వ్యవహరించిన మహ్మద్ యూనస్ ఈ పరిస్థితులకు ప్రధాన కారణమన్నారు. ఆయన కాలంలో దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించి రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తేవడానికి యత్నించారన్నారు.

బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ మాట్లాడుతూ " ఆయన పదవిలో ఉన్నంత కాలం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎటువంటి చర్చల్లో పాల్గొనలేదు. నన్ను పదవిలోంచి తొలగించే కుట్రలు జరిగాయి. అదేవిధంగా చాలాసార్లు దేశంలో అస్థిరత, అశాంతి సృష్టించి రాజ్యాంగ సంక్షోభం సృష్టించే యత్నాలు జరిగాయి. అని ఆదేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.

అదేవిధంగా మహ్మద్ యూనస్ తన పదవి కాలంలో ఎటువంటి రాజ్యాంగంగా నిర్వహించాల్సిన తుంగలో తొక్కారని తన విదేశీ పర్యటనల సమయంలో దేశ అధ్యక్షునికి తెలపాల్సిన కనీస సమాచారం ఇవ్వలేదన్నారు.  విదేశీ పర్యటనల వివరాలు అధ్యక్షునితో పంచుకోవాల్సి ఉండగా దానిని సైతం పాటించలేదని తెలిపారు. అంతే కాకుండా తన పదవికాలంలో ఒక్కసారి కూడా తనను కలవడానికి అధ్యక్షుని నివాసానికి రాలేదని షహబుద్దీన్ తెలిపారు.

ఏడాదిన్నర కాలం పాటు యూనస్ ప్రభుత్వం తనను ప్యాలెస్ ఖైదీగా బంధించిందని కోస్వో, ఖతార్ దేశ పర్యటనలను చేయాల్సి ఉండగా తనకు అనుమతులివ్వలేదని తెలిపారు. అయితే ఒకానోక సమయంలో తన స్థానంలో మాజీ న్యాయమూర్తిని అధ్యక్షున్ని చేద్దామని భావించగా రాజ్యాంగ నియమాలు సహకరించవని ఆ న్యాయమూర్తి చెప్పడంతో వారు వెనక్కి తగ్గారని తెలిపారు.

2024 అక్టోబర్ 22న జరిగిన సంఘటన తానిప్పటికి మరిచిపోనని ఆ సమయంలో అల్లరిమూక అధ్యక్ష భవనంపై దాడికి యత్నించిందని అయితే మిలిటరీ తక్షణమే స్పందించి వారిని అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం బీఎన్‌పీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని నమ్మకముందని షహబుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)