Breaking News

హసీనా ఎఫెక్ట్‌.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్‌ అసహనం

Published on Thu, 06/12/2025 - 09:07

ఢాకా: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్‌ను అంగీకరించలేదని యూనస్‌ చెప్పుకొచ్చారు. షేక్‌ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.

లండన్‌లోని చాఠమ్‌ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్‌ యూనస్‌ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్‌స్టెక్‌ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్‌.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్‌..‘హసీనాకు భారత్‌లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్‌ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్‌లైన్‌లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్‌ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్‌ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్‌ హసీనా.. యూనస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్‌ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్‌ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)