హసీనాను రప్పించడమే ప్రాథమ్యం

Published on Thu, 02/20/2025 - 06:19

ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్‌ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్‌ ప్రెస్‌ కార్యదర్శి షఫీకుల్‌ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్‌ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. 

ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. 

యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా 
మహమ్మద్‌ యూనస్‌ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. 

యూనస్‌ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్‌ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు.  
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)