Bangladesh: ఆ 700 మంది ఖైదీలు ఎక్కడ?

Published on Mon, 01/27/2025 - 07:50

ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. గత ఏడాది(2024) జూలై-ఆగస్టులలో  బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చెలరేగిన సమయంలో జైళ్ల నుంచి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.  

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గతంలో వివిధ జైళ్ల నుంచి పరారైన ఖైదీలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. సుమారు 700 మంది ఖైదీలు జైళ్ల నుంచి పరారయ్యారని  బంగ్లాదేశ్‌ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఢాకాలో విలేకరులకు తెలిపారు. వారిని వెదికి పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్న వారి వివరాలను పూర్తిగా వెల్లడించకుండానే.. ఈ తరహా ఖైదీలలో కొందరిని అరెస్ట్‌ చేశామని, మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టు ఐదు తర్వాత సాధారణ క్షమాభిక్ష కింద ఏ దోషి కూడా జైలు నుండి విడుదల కాలేదని అన్నారు. అయితే బెయిల్‌పై విడుదలైన వారు ఏదైనా నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే, వారిని అరెస్టు చేసి  చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దాదాపు 700 మంది ఖైదీలు, దోషులుగా తేలిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు పరారీలో ఉన్నారని గతంలో  బంగ్లాదేశ్‌ జైలు అధికారులు ప్రకటించారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్‌ మీడియాలో చక్కర్లు

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)