Breaking News

Bangladesh: మరో హిందూ యువకుని దారుణ హత్య

Published on Thu, 02/12/2026 - 11:32

ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చంపారా టీ గార్డెన్ కార్మికుడైన 28 ఏళ్ల రతన్ శుభోకర్ పోలీసులకు విగతజీవిగా కనిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటుచేసుకుంది.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానిక పత్రిక 'డైలీ స్టార్' నివేదిక ప్రకారం రతన్ శుభోకర్ మృతదేహం రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించిన  కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు లక్ష్మణ్ కర్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి నుండి రతన్ కనిపించకుండా పోయాడని,  తరువాత తోటలో శవమై కనిపించాడని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తమకు తెలియవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, నిందితులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేళ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత జనవరి నెలలోనే జైలు కస్టడీలో దాదాపు 15 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. మరణించిన వారిలో అవామీ లీగ్ సీనేయర్ నేత రమేష్ చంద్ర సేన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రళయ్ చకి  తదితరులు ఉన్నారు. డిసెంబర్ 2024లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన అశాంతిలో పలువురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతల గురించి హామీలు ఇస్తున్నప్పటికీ, మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరుగుతుండటంపై మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)