Breaking News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు

Published on Wed, 01/21/2026 - 19:27

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో అక్కడి రాడికల్ నేత ఉస్మాన్‌ హాదీ మృతితో  నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి.  ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలోని  భారత  అధికారులు, వారి కుటుంబాలు వెంటనే అక్కడినుంచి దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో హిందు దేవాలయాలు, వ్యక్తులే టార్గెట్‌గా ఇంతకాలం దాడులు జరిగాయి. అవి కొద్ది మేర సద్దుమణుగుతాయనే సమయంలోనే అక్కిడ రాడికల్ నేత ఉస్మాన్‌ హాదీని దుండగులు హతమార్చడంతో అక్కడి మతఛాందస వాదులు విరుచుకపడుతున్నారు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిపి వారిని హతమారుస్తున్నారు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం ఈ ప్రస్థావన వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత అధికారులు వారి కుటుంబసభ్యులు వెంటనే మాతృ దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది." ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా భారత అధికారులు వారి కుటుంబసభ్యులు స్వదేశానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కొనసాగుతుంది". అని అధికారులు పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తగ్గేంత వరకూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ దేశంలో వచ్చే నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హిందువులపై దాడులు పెరుగుతున్నట్లు పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)