Breaking News

భారత్‌లో షేక్‌ హసీనా.. అజిత్‌ దోవల్‌తో భేటీ!

Published on Mon, 08/05/2024 - 17:31

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లకు సంబంధించిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన సోదరి షేక్‌ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకుంది. నేటి రాత్రి లోపు దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వాకర్‌-ఉజ్‌-జమాన్ ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలోనే బంగ్లాదేష్‌ ప్రధాని పదవి నుంచి 76 ఏళ్ల షేక్‌ హసీనా దిగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు.. క్రమంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం. తీవ్ర ఆందోళనలతో ఢాకాలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సెక్యూరిటీ ఆదేశించడంతో ఆగమేఘాల మీద దేశం విడిచి వెళ్లినట్లు వినికిడి.

భారత్‌లో షేక్‌ హసీనా..
అయితే షేక్‌ హసీనా భారత్‌కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య  సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు.  ఇది యూపీలోని ఘజియాబాద్‌లో ఉంది. అక్కడ  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు. 

అనంతరం ఆమె లండన్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీ​ఇ వివరించారు. అయితే మోదీ హసీనాను కలుస్తారో లేదన్న విషయంపై స్పష్టత లేదు.

బీఎస్‌ఎఫ్‌ అలెర్ట్‌..
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అప్రమత్తమైంది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి హై అలర్ట్‌  ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్‌ఎఫ్‌ డీజీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు పొరుగు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్‌తో అన్ని రైళ్ల సేవలను నిలిపివేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)