Breaking News

పాక్‌లో ఉద్రిక్తత.. ‘సురబ్‌’పై బీఎల్‌ఏ జెండా?

Published on Sat, 05/31/2025 - 07:25

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army)(బీఎల్‌ఏ) తాజాగా తాము సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అక్కడి బ్యాంక్, లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. క్వెట్టా-కరాచీ, సురబ్-గిడ్డర్ రహదారులపై రాపిడ్ చెకింగ్,పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

గత కొన్నాళ్లుగా బీఎల్‌ఏ తిరుగుబాటుదారులు పాకిస్తాన్‌లో అలజడి సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో బలూచిస్తాన్‌(Balochistan)పై పాకిస్తాన్ పూర్తిగా నియంత్రణను కోల్పోయింది. పాక్‌తో జరిగిన తీవ్ర ఘర్షణల తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని, పోలీసు దళాలను విజయవంతంగా వెనక్కి నెట్టగలిగామని బలూచ్‌ సాయుధ బృందం కమాండర్లు తెలిపారు.

దీనిపై పాకిస్తాన్‌ అధికార వర్గాలు స్పందిస్తూ, కొందరు సాయుధ వ్యక్తులు సురబ్‌ నగరంలోకి ప్రవేశించారని తెలిపారు. వారు ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై కాల్పులు జరిపారని, ఆ అధికారులను కిడ్నాప్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే ఒక బ్యాంకును స్వాధీనం చేసుకున్నారని, కొన్ని దుకాణాలను తగలబెట్టారని తెలిపారు. అయితే వారు  సురబ్ నగరంపై నియంత్రణ సాధించలేదన్నారు. కాగా శుక్రవారం బలూచిస్తాన్‌లోని సురబ్ నగరంలో ఉగ్రవాదులు ఒక అధికారి ఇంటిపై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు ప్రావిన్షియల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: పూంచ్‌ బాధితులకు హోం మంత్రి పరామర్శ

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)