Breaking News

కింగ్‌ చార్లెస్‌3కి షాక్‌.. ‘నువ్వు మా రాజువి కావంటూ’ నినాదాలు

Published on Mon, 10/21/2024 - 15:09

కాన్ బెర్రా : బ్రిటన్ రాజు చార్లెస్‌-3 ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అవమానం జరిగింది. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తుండగా ఆస్ట్రేలియా మ‌హిళా సేనేట‌ర్ లిడియా థోర్ప్ ఆయ‌న‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నువ్వు మా రాజు కాదు అంటూ వ‌ల‌స‌వాదానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.  

‘నువ్వు మా రాజు కాదు. నువ్వు మారణ హోమానికి పాల్పడ్డావు. మా భూమిని,  మా నుండి దోచుకున్న వాటిని మాకు ఇవ్వండి’ అని ఆరోపించారు

ఆస్ట్రేలియా రాజుగా ఈ ఏడాది తొలిసారి కింగ్ చార్లెస్  ఆస్ట్రేలియాలో ఐదురోజుల పాటు పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లో ప్రసంగించారు. కింగ్ చార్లెస్ ప్రసంగ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న థోర్ప్ విమ‌ర్శ‌లు గుప్పించారు.  థోర్ప్ తీరుపై ఆస్ట్రేలియా ప్ర‌జాప్ర‌తినిధులు ఖండించారు. మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్ సైతం థోర్ప్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం దురదృష్టకరం అని అన్నారు. కాగా, రాచరికానికి వ్యతిరేకంగా సేనేట‌ర్ లిడియా థోర్ప్ గ‌తంలో ప‌లు మార్లు ఇలాగే వ్య‌వ‌హ‌రించారు. 

 

 

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)