Breaking News

‘పాక్‌లో నన్ను వేధిస్తున్నారు’.. మహిళ ఆడియో వైరల్

Published on Sun, 01/18/2026 - 16:19

ఇస్లామాబాద్‌: సర్భ్‌జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ఆమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్‌జిత్ కౌర్.. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గతేడాది నవంబర్‌లో వాఘబార్డర్‌ మీదుగా  పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. ఆ తీర్థయాత్రకోసం దాదాపు 2 వేల మంది భక్తులు పాకిస్థాన్‌ వెళ్లగా అందరూ తిరిగి వచ్చారు. అయితే సర్బ్‌జిత్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా వారు విచారించారు. అప్పుడు ఆమె అక్కడే నశీర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. తాజాగా ఇప్పుడు ఆమె పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది.

అందులో  అక్కడ తాను అస్సలు బాగాలేనని తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని  అన్నట్లు ఉంది. దయచేసి తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలని తన భారత్‌లో ఎటువంటి హాని చేయనని ఆమె అందులో అన్నారు. తన పిల్లలను చూడాలని ఉందని ఎంతోమందికి లక్షల రుపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోందని ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఆడియో క్లిప్‌ సర్బ్‌జిత్‌ కౌర్‌కు చెందిందా కాదా  అనే విషయం పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.

అయితే సర్బ్‌జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడి పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన లాహెర్ కోర్టు సర్భ్‌జిత్‌ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి తరలించినట్లు అక్కడి తెలిపారు. అయితే  కౌర్‌ను ఇది వరకే పాకిస్థాన్‌ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని  అక్కడి అధికారులు అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)