Breaking News

నౌకలపై దాడులు.. ఇంధన సరఫరాపై ప్రభావం: జై శంకర్

Published on Tue, 01/16/2024 - 11:20

టెహ్రాన్‌: ఎర్రసముద్రంలో వాణిజ్య రాకపోకలకు పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. భారతదేశానికి సమీపంలో నౌకలపై దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు ఎవరికీ ప్రయోజనం కలిగించబోవని చెప్పారు. ఎర్రసముద్రంలో ఓడలపై జరుగుతున్న దాడుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్‌తో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు.

"భారతదేశ సమీపంలోనూ కొన్ని దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ సమాజానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి చర్యలు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ చర్యలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు.” అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.

గాజాలో యుద్ధం ఆందోళన కలిగించే అంశమని జైశంకర్ అన్నారు. పౌరుల ప్రాణనష్టం, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులతో మానవతా సంక్షోభం నెలకొంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గాజాకు భారత్ స్వయంగా సామగ్రిని పంపి సహాయం చేసిందని స్పష్టం చేశారు. పాలస్తీనాలో నెలకొన్న పరిస్థితుల్ని పరిష్కరించేలా భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)