Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌పై మునీర్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 12/22/2025 - 10:12

ఇస్లామాబాద్‌: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మెరుపు దాడుల సమయంలో పాకిస్తాన్‌కు దైవిక సహాయం లభించిందని ఆ దేశ రక్షణ దళాల అధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే నెలలో పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల సమయంలో తమ సైన్యానికి ఏదో అదృశ్య శక్తి తోడు అందించిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంలో ‘జిహాద్’ అంశంపై మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇస్లామిక్  దేశంలో ప్రభుత్వం లేదా అధికారం ఉన్న పాలకుల అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా జిహాద్‌కు ఆదేశాలు ఇవ్వలేరని స్పష్టం చేశారు. ఎవరైనా తమకు తాముగా ఫత్వాలు జారీ చేయడం చెల్లదని అన్నారు. మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాల రక్షకులుగా ఉండే గౌరవం దేవుడు తమకే ఇచ్చారని ఈ సందర్భంగా  మునీర్‌ పేర్కొన్నారు.

పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్‌కు అసిమ్ మునీర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్‌లోకి చొరబడి దాడులకు తెగబడుతున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)గ్రూపుల్లో 70 శాతం మంది ఆఫ్ఘన్ జాతీయులే ఉన్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ప్రజల రక్తాన్ని  కోరుతున్న వారికి మద్దతు ఇవ్వడం సరికాదని ఆయన  అన్నారు. భారతదేశంతో జరిగిన ఆ నాలుగు రోజుల సైనిక ఘర్షణ ముగిసిన తీరును ఆయన విశ్లేషించారు. మే 10న కుదిరిన ఒప్పందంతో సైనిక చర్యలు నిలిచిపోయినప్పటికీ, నాడు పాకిస్తాన్‌కు ఎదురైన గడ్డు పరిస్థితుల నుండి దైవ కృపే రక్షించిందని అన్నారు.

ఇది కూడా చదవండి: మరో చరిత్ర: జర్మనీకి ఇజ్రాయెల్ ‘ఆరో’ రక్షణ

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)