Breaking News

ఉగ్రవాదుల గౌరవం కోసం మునీర్ పట్టు .. జెఈఎం కమాండర్ వెల్లడి

Published on Thu, 09/18/2025 - 11:39

న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్‌ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వెల్లడించారు.

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో జరిగిన నష్టాన్ని జైష్ ఎ మొహమ్మద్ (జెఈఎం) కమాండర్ అంగీకరించిన రెండు రోజుల తర్వాత, అదే కమాండర్ షేర్‌ చేసిన మరొక క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ భారత ఆపరేషన్‌లో మరణించిన పాక్‌ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని ఉన్నతాధికారులకు సూచించారని చెప్పడం వినవచ్చు.
 

ఈ వీడియోలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హతమైన ఉగ్రవాదులకు నివాళులు అర్పించే దేశ నేతలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో జైష్ ఎ మొహమ్మద్ పాత్ర ఉందని భారత్‌ ఇంకా ఆధారాలు సమర్పించలేదని ఆయన చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. కాగా మే 7న బహవల్పూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారత క్షిపణి దాడుల్లో ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం నాశనమయ్యిదని కశ్మీరీ అంగీకరించారు. కాగా అసిమ్ మునీర్ ఆదేశాల దరిమిలా పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్, పోలీసు సీనియర్ అధికారులు ఉన్నత అధికారులు  ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)