Breaking News

డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యకు మరోసారి కుట్ర!

Published on Wed, 08/07/2024 - 11:29

వాషింగ్టన్ డీసీ :  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. అయితే ఈ కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారు.  కొన్నాళ్లు ఇరాన్‌లో ఉండి ఇటీవలే అమెరికాకు వచ్చిన పాకిస్థాన్ జాతీయుడు అసిఫ్ మర్చంట్ డొనాల్డ్ ట్రంప్, మరో వీఐపీని హత మార్చేందుకు ప్రయత్నించాడు.

ఈ క‍్రమంలో తాము షూటర్లమేనంటూ ఎఫ్‌బీఐ అధికారులు అసిఫ్‌ మర్చంట్‌ను నమ్మించారు. ఆపై అదుపులోకి తీసుకున్నారు. అయితే అసిఫ్‌కు ట్రంప్‌పై కొద్దిరోజుల క్రితం జరిపిన కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా మీడియా తెలిపింది. 

సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా పరిగణించే జనరల్ ఖాసిమ్ సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు అసిఫ్‌ మర్చంట్‌  ట్రంప్‌పై కుట్రకు యత్నించినట్లు సమాచారం.

ఖాసిమ్‌ సులేమానీ ఎవరు?
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా జనరల్ ఖాసిమ్ సులేమానీని పరిగణించే ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి జరిపి హతమార్చాయి. 

అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద్దిసేపటి ముందు ఏం జరిగింది,డ్రోన్ ఆపరేషన్‌లో సులేమానీ ఎలా మృతి చెందిందీ అనే విషయాలను ట్రంప్ బహిర్గతం చేశారు. నాటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది. తాజాగా, ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్‌.. అసిఫ్‌ మర్చంట్‌ను అమెరికా పంపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)