Breaking News

ద.కొరియా అధ్యక్షుడికి కోర్టు షాక్‌

Published on Tue, 12/31/2024 - 07:50

సియోల్‌:సౌత్‌కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు అక్కడి కోర్టు షాక్‌ ఇచ్చింది. ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్‌ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్‌ జారీ చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు తాజాగా కోర్టును కోరారు.

పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యోల్‌ డిసెంబర్‌3న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది.

ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్‌ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్‌ వారెంట్‌ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.

తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్‌ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్‌ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యోల్‌ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.
 

Videos

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)