Breaking News

Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు

Published on Tue, 11/12/2024 - 10:25

ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్‌ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన  లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని,  హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని  భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

 

నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)