Breaking News

పాట పాడి.. మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్‌ గాయని

Published on Sat, 06/24/2023 - 17:26

వాష్టింగ్టన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక పర్యటన ముగింపు సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (USICF) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్‌-అమెరికన్‌ హాలీవుడ్‌ నటి, గాయని మేరీ మిల్‌బెన్ భారత జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీని తర్వాత ఓం జై జగదీశే హరే పాట కూడా పాడారు.

చివరిలో ఆమె ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటరులో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని హాజరు కాగా ఈ ఘటన చోటు చేసుకుంది. మిల్‌బెన్‌ మాట్లాడుతూ.. జాతీయ గీతం, దేశభక్తి సంగీతాన్ని ఆలపించడానికి తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని అటునుంచి ఈజిప్టు పర్యటనకు పయనమయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని అమెరికా బయలుదేరే ముందే ఈజిప్ట్ పర్యటననుద్దేశించి మాకు అత్యంత సన్నిహితమైన దేశం ఈజిప్టు సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది.


 

చదవండి: Titanic Submarine Disaster: ‘టైటాన్‌ మునుగుతుందని ముందే చెప్పా’.. అందుకే జాబ్‌ నుంచి పీకేశారు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)