Breaking News

ఇరాన్‌ ముప్పు.. ఇజ్రాయెల్‌కు అమెరికా రక్షణ కవచం

Published on Sat, 08/03/2024 - 09:50

ఇరాన్‌తో పాటు ఆ దేశం మద్దతు కలిగిన రెబల్‌ గ్రూపుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా పశ్చిమాసియాలో అదనపు యుద్ధ విమానాలను, నౌకాదళ నౌకలను భారీగా మోహరించేందుకు సమయాత్తమవుతోంది.

ఇరాన్, రెబల్‌ గ్రూపుల నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా  ఇజ్రాయెల్‌కు రక్షణ అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. పశ్చిమాసియాకు మరిన్ని యుద్ధ విమానాలను పంపాలని అమెరికా డిఫెన్స్ చీఫ్‌ను ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది.

ఇదేవిధంగా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో చర్చలు జరిపారు. ఈ  సందర్భంగా ఆస్టిన్ ఇజ్రాయెల్‌కు అదనపు సహాయాన్ని అందిస్తామని హామీనిచ్చారు. టెహ్రాన్‌లో ఇటీవల హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే అమెరికా ఇజ్రాయెల్‌కు సహకారం అందిస్తోంది.

హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హెజ్ బొల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియా నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హెజ్ బొల్లా ఆరోపిస్తున్నాయి. ఈ మూడు ఇజ్రాయెల్ పైకి దండెత్తే అవకాశాలున్నాయని అమెరికా అంచనా వేస్తోంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)