Breaking News

California wildfires: కార్చిచ్చుతో రాజకీయం

Published on Sat, 01/11/2025 - 17:16

అమెరికాలో కార్చిచ్చు.. రాజకీయ మలుపు తీసుకుంది. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌(డెమోక్రటిక్‌) కారణంగానే మంటలు విస్తరించాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌. అయితే దీనికి గావిన్‌ కౌంటర్‌గా ఒక లేఖ విడుదల చేశారు.

కాలిఫోర్నియా(California)లో మంటలు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ను కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ ఆహ్వానించారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితుల్ని పరామర్శించాలని కోరారు. అంతేకాదు.. ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దంటూ ట్రంప్‌కు చురకలంటించారు.  

గతంలో ఆరేళ్ల కిందట ట్రంప్‌(Trump) అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఈ తరహా ఘటన చోటు చేసుకుందని, ఆ టైంలో బాధితుల్ని ఆయన పరామర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పుడు కాలిఫోర్నియా కష్టంలో ఉంటే.. రాజకీయం చేయడం సరికాదన్నారు. కాలిఫోర్నియా కార్చిచ్చు తర్వాత అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) సత్వరమే స్పందించారని గవర్నర్‌ గావిన్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్‌ నుంచి వెళ్లిపోయే ముందు బైడెన్‌ తనకు మిగిల్చింది ఇదేనంటూ కాలిఫోర్నియా కార్చిచ్చును ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మంటల్ని ఆర్పడంలో ఘోరంగా వైఫల్యం చెందారంటూ కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు డెమోక్రట్లకు, రిపబ్లికన్లకు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 

మరోవైపు.. కెనడా(Canada)ను అమెరికా 51వ  రాష్ట్రంగా చేర్చుకుంటామంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో తెలిసిందే. ఈ దరిమిలా.. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌తో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం తన ఎక్స్‌ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. ‘‘అమెరికా, కెనడా కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు.. అంతకు మించి. కష్టకాలంలో మేం స్నేహితులమనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు.  

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)