Breaking News

ఆరేళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. తొలి ఫొటో షేర్‌ చేసిన లారెన్‌

Published on Sat, 06/28/2025 - 10:32

ఆరేళ్ల డేటింగ్‌ తర్వాత ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు జెఫ్‌ బెజోస్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ లారెన్‌ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరం వెనిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లివేడుకకు హాలీవుడ్‌ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలుకా ఫస్ట్‌ ఫొటోను లారెన్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థపాకుడిగా, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జెఫ్‌ బెజోస్‌(61) కొనసాగుతున్నారు. 2019 నుంచి జర్నలిస్ట్‌ అయిన లారెన్‌(55)తో ఆయన డేటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా.. శుక్రవారం(జూన్‌ 27న) వీళ్ల వివాహం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్‌ కుష్నెర్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే, కిమ్‌ కర్దాషియన్‌, కోలే కర్దాషియన్‌, జోర్డాన్‌ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

వివాహం తర్వాత ఈ ఇన్‌స్టా పేజీకి తన పేరును లారెన్‌ శాంచెజ్‌ బెజోస్‌గా మార్చుకున్న ఆమె.. గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్‌ చేశారు. కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్ట్‌లను షేర్‌ చేశారు. 

జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos), లారెన్‌లు 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్‌ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. లారెన్‌తో ఎంగేజ్‌మెంట్‌ టైంలో 2.5 మిలియన్‌ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్‌ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.

జెఫ్‌ బెజోస్‌ గురించి.. 
జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్‌లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

వైవాహిత జీవితానికొస్తే.. 
మెకెంజీ స్కాట్‌ను బెజోస్‌ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. మెకెంజీ స్కాట్‌ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి, దాతృత్వవేత్త. అమెజాన్‌ స్థాపన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. విడాకుల సమయంలో ఆమెకు సుమారు 38 బిలియన్ డాలర్లు విలువైన అమెజాన్‌ షేర్లు లభించాయి. విడాకుల అనంతరం మెకెంజీ స్కాట్‌ తన సంపదలో పెద్ద భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారామె. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్షలేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు నలుగురు పిల్లలు(ఒకరిని దత్తత తీసుకున్నారు). ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహం చేసుకున్నారు. 

లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55.  ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు.  "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.

లారెన్‌ గతంలో ఎన్‌ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్‌ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్‌ వైట్‌సెల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్‌ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్‌ బెజోస్‌తో డేటింగ్‌ మొదలు పెట్టారు.

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు