Breaking News

అమెరికా హెచ్చరికలు.. వెనిజులాకు పలు దేశాల షాక్!

Published on Mon, 11/24/2025 - 09:12

కారకాస్: వెనిజులాలో భద్రతా పరిస్థితులు మరింతగా దిగజారడానికి తోడు, ఆ దేశ గగనతలంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరగడంతో, ప్రపంచంలోని పలు ప్రధాన విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను వెనిజులాకు నిరవధికంగా రద్దు చేశాయి. యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఇటీవల పైలట్‌లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశంలో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో, అలాగే అన్ని ఎత్తులలో విమానాలకు బెదిరింపులు  ఎదురయ్యే అవకాశాలున్నాయని దానిలో పేర్కొంది.

ఒంటరిని చేసి..
ఈ పరిణామాల దరిమిలా వెనిజులాలోని ఎయిర్‌లైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం, టీఏపీ, ఎల్‌ఏటీఏఎం, ఏవియాంకా, ఇబెరియా, గోల్, కరేబియన్ తదితర ఆరు ప్రధాన క్యారియర్‌లు ఇప్పటికే తమ విమానాలను నిలిపివేశాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్ కూడా తాత్కాలికంగా నవంబర్ 24 నుండి 28 వరకు తమ సర్వీసులను రద్దు చేసింది. ఈ సంక్షోభం ప్రధానంగా ట్రంప్ పరిపాలనా విభాగం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచడంతో ఏర్పడింది. మదురోను దక్షిణ అమెరికా దేశానికి చట్టబద్ధమైన నాయకునిగా అమెరికా పరిగణించడం లేదు. దీనిలో భాగంగానే అమెరికా సైన్యం వెనిజులా తీరం వరకు బాంబర్ విమానాలను మోహరించింది. విమానాల రద్దుపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. వెనిజులాకు అంతర్జాతీయ అనుసంధానాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. ఈ చర్యలు తమ దేశానికి అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని పెంచుతాయని, తద్వారా సామాన్య పౌరులు ఇబ్బందులు పడతారని పెట్రో అభిప్రాయపడ్డారు.

వెనిజులాతో వివాదానికి కారణం ఇదే..
అమెరికా- వెనిజులా మధ్య ఘర్షణ ప్రధానంగా నికోలస్ మదురో నాయకత్వం చుట్టూ తిరుగుతోంది. 2018 ఎన్నికల ఫలితాలను అమెరికా అంగీకరించకపోవడానికి తోడు ప్రతిపక్ష నేత జువాన్ గైడోకు మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. మదురో ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘనలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేస్తూ, అమెరికా ఆ దేశంలోని చమురు రంగంతో సహా పలు కీలక రంగాలపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెనిజులా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికితోడు అమెరికా.. కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలను, బాంబర్ విమానాలను మోహరించి, సైనిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఉద్రిక్తతతలకు తొడు గగనతలంలో భద్రతపై అమెరికా జారీ చేసిన హెచ్చరికల కారణంగానే అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెనిజులాకు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అమెరికా మదురోను అధికారంలో నుండి తొలగించేందుకు యోచిస్తుండగా, మదురో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపధ్యంలో వెనిజులా ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

ఇది కూడా చదవండి: Delhi: మోగిన ప్రమాద ఘంటికలు.. ఉదయాన్నే ఆగిన ఊపిరి

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)