Breaking News

ఎయిరిండియా పైలట్‌ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు

Published on Thu, 01/01/2026 - 13:16

విమాన ప్రమాదాలు, ఇండిగో సంక్షోభంతో  విమానాలు రద్దు లాంటి అనేక ఇబ్బందులతో విమాన ప్రయాణ మంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి ప్రయాణికులది. తాజాగా  జరిగిన మరో సంఘటన విమాన ప్రయాణికుల  గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో ఎయరిండియా పైలట్‌ బుక్‌ అయ్యాడు.  స్టోరీ ఏమిటీ అంటే...

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫెస్టివ్‌ మూడ్‌లో ఉన్న పైలట్‌ మద్యం సేవించి వాంకోవర్‌నుంచి ఢిల్లీకి బయలు దేరిన బోయింగ్ 777-AI 186 విమానంలో విధులకు సిద్ధ పడ్డాడు.  విమానంలో పైలట్ భద్రతా ప్రోటోకాల్‌ పరీక్షల్లో పట్టుబడ్డాడు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు  గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు నివేదించారు. వారు తక్షణమే పైలట్‌ను బ్రీత్ అనలైజర్ పరీక్షలో పట్టుబడ్డాడు. దీంతో అతని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాన్ని రెండు గంటల పాటు నిలిపి వేశారు. విషయం తెలిసి ప్రయాణీకులు ఆందోళన పడ్డారు. 2025 డిసెంబరు 23న సంఘటన చోటు చేసుకుంది. 

పైలట్‌ వ్యవహారం బయటపడటంతో ఎయిరిండియా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు పైలట్లు రెండు షిఫ్ట్‌లతో నడిచే ఈ అల్ట్రా-లాంగ్-హాల్ విమానం స్థానిక సమయం సాయంత్రం 5 గంటలకు బయలు దేరింది. షెడ్యూల్ కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి, వియన్నాలో కొత్త సిబ్బందితో ఢిల్లీకి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా తీవ్రంగా స్పందించింది. పైలట్‌ను ఢిల్లీకి తరలించి, దర్యాప్తు చేపట్టింది. జీరో-టాలరెన్స్ తమ విధానమని, నిబంధనల ఉల్లంఘనను సహించబోమని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీలకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అలాగే ఈ విషయాన్ని ఎయిర్‌లైన్‌ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి నివేదించింది.

మరోవైపు పైలట్ విమానాశ్రయంలో అనుకోకుండా మద్యం తాగాడని కొందరు చెప్పగా, మరికొందరు బాటిల్‌ కొన్న సందర్భంగా మద్యం వాసన వచ్చిందని చెబుతున్నారు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)