Breaking News

రష్యాలో ఎయిరిండియా ప్రయాణికుల అగచాట్లు!

Published on Wed, 06/07/2023 - 15:45

ఎయిర్‌ ఇండియా విమానం రష్యాలోని మగడాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రయాణికులు భాషా సమస్య, విబిన్న ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఢిల్లీకి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకోవాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం బోయింగ్‌ 777లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు.  చాలా మంది పిల్లలు, వృద్ధులు ఉ‍న్నారు. వారిని బస్సుల్లో వివిధ ప్రాంతాలకు పంపించారని ప్రయాణికులు చెబుతున్నారు.

కొంతమందికి పాఠశాలల్లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అక్కడ లభించే విభిన్న ఆహారం తినలేక ఇబ్బంది పడుతుంటే..దీనికి తోడు అక్కడ భాష అస్సలు అర్థం గాక మరింత గందగోళంగా ఉన్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. పిల్లలతో ఉన్న ప్రయాణికులు అరకొర వసతులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ఎయిర్‌ ఇండియా ప్రయాణికుడు మాట్లాడుతూ..తమకు ఓ కళాశాల హాస్టల్‌లో వసతి కలప్పించారని, లక్కీగా తమకు ఇక్కడ వైఫై అందుబాటులో ఉండటంతో తమ కుటుంబాలతో టచ్‌లో ఉండగలిగామని చెప్పుకొచ్చారు.

మరికొంతమంది ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఒకే గదిలో 20 మంది నిద్రించాల్సిన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిక్కుకుపోయిన ప్రయాణికులను మగడాన్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించడానికి ముంబై నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని పంపనున్నట్లు ఎయిర్‌ ఇండియా బుధవారం ప్రకటించింది.

విమానాయన సంస్థ ప్రయాణికులకు కావాల్సిన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తున్నామని, వారందరికీ హాస్టళ్లు, హోటళ్లలో వసతి కల్పించామని పేర్కొంది. కాగా, ఎయిర్‌ ఇండియా మగడాన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆ విమానంలో తలెత్తిన సాంకేతిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు రష్యా ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది.

(చదవండి: ఎయిరిండియా విమానం రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్‌)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?