Breaking News

బద్దలైన బేస్‌లు

Published on Wed, 05/14/2025 - 03:42

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్‌ వైమానిక స్థావరాలపై భారత్‌ జరిపిన క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోయాయని స్పష్టమైంది. తాజాగా విడుదలైన శాటిలైట్‌ ఉపగ్రహాల స్పష్టమైన ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారత్‌ చేసిన దాడుల్లో పాకిస్తాన్‌ వ్యాప్తంగా 11 మిలటరీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వైమానిక స్థావరాల్లోని విమాన రన్‌వేలు, విమానాలను నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఈ శాటిలైట్‌ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక ప్రైవేట్‌ వాణిజ్య ఉపగ్రహ సంస్థ ఈ హై–రెజల్యూషన్‌ ఫొటోలను తీసింది. ఏమాత్రం అటూఇటూగా కాకుండా, గురిచూసి సరిగ్గా వాయుసేన స్థావరాల మీదనే బాంబులు పడేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. భారత్‌పై మరింతగా దాడులకు తెగిస్తే ఆకాస్త స్థావరాలనూ పూర్తిగా నేలమట్టం చేస్తారనే భయంతోనే మూడ్రోజులకే పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచి్చందనే వాదనకు పూర్తి బలం చేకూర్చేలా ఫొటోలు ఉన్నాయి. మాక్సార్‌ అనే శాటిలైట్‌ సంస్థ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు జాతీయమీడియాలో మంగళవారం ప్రత్యక్షమయ్యాయి. సింధ్‌లోని సిక్కూర్, రావర్పిండిలోని నూర్‌ ఖాన్, దక్షిణ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రహీం యార్‌ ఖాన్, సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సిం«ద్‌లోని జకోబాబాద్, ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైన తీరు ఫొటోలో వివరంగా తెలుస్తోంది. 

దాడి తర్వాత కీలక మిలటరీ బేస్‌లలో రన్‌వేలపై భారీ గొయ్యి, కార్యనిర్వాహక భవనాలు, నిల్వ కేంద్రాల పైకప్పులకు పెద్ద రంధ్రాలు పడటం, భవంతుల గోడలు కూలి శిథిలాలు, శకలాలు సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిన వివరాలు ఫొటోల్లో తెలుస్తున్నాయి. పస్రూర్, సియాల్‌కోట్‌లోని రాడార్‌ కేంద్రాలు క్షిపణుల దెబ్బకు పేలిపోయాయి. సుక్కూ ర్‌ ఎయిర్‌బేస్‌లో రెండు విమాన షెల్టర్‌లు కూలిపోయాయి. చక్లాలాలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌లో భారీ సైనిక, సరకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బతిన్నాయి. రహీం యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌లో ఒక్కటే రన్‌వే ఉంది.

దానిపై బాంబులేయడంతో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్‌వే పాక్షికంగా ధ్వంసమైంది. ముషాఫ్‌ ఎయిర్‌బేస్‌ రన్‌వేపై రెండు పేద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి 10, మరోటి 15 అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు ఆగిపోయాయి. సమీప రవాణా వాహనాలూ దెబ్బతిన్నా యి. జకోబాబాద్‌లోని షాబాజ్‌ ఎయిర్‌బేస్‌తోపాటు భోలారీ ఎయిర్‌బేస్‌లో చెరో విమాన హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. హ్యాంగర్‌లో నిలిపిఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)