Breaking News

పవర్‌ కట్‌తో లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత

Published on Fri, 03/21/2025 - 10:42

లండన్‌: భారీ అగ్నిప్రమాదంతో పవర్‌ కట్‌ చోటు చేసుకోగా హీథ్రో ఎయిర్‌పోర్టు మూతపడింది. రెండు రోజులపాటు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ప్రయాణికులెవరూ ఎయిర్‌పోర్ట్‌ వైపు రాకూడదని విజ్ఞప్తి జారీ చేశారు. ఎయిర్‌పోర్టుకు విద్యుత్‌ సరఫరా చేసే ఓ ఎలక్ట్రిక్‌ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం చెలరేగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

లండన్ బరో ఆఫ్ హిల్లింగ్డన్‌లోని హయేస్‌లో ఉన్న ఓ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హీథ్రో ఎయిర్‌పోర్టుతో పాటు సుమారు 16 వేల నివాసాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  విదుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో కార్యకలాపాలు నిలిచిపోగా.. అధికారులు ఎయిర్‌పోర్టు మూసేశారు. పలు విమానాలు దారి మళ్లగా.. తిరిగి సేవలను పునరుద్ధరించే అంశంపై నిర్వాహకులు స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవర్‌ కట్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడంపై జోకులు పేలుస్తున్నారు.

మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా చెలరేగిన పొగ, ధూళితో బరో ఆఫ్ హిల్లింగ్డన్‌ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న 10 ఫైర్‌ ఇంజన్లను, 200 సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. దట్టమైన పొగ అలుముకోవడంతో ఎవరూ బయటకు రావొద్దని.. తలుపులు, కిటికీలు మూసే ఉంచాలని అధికారులు స్థానికులకు సూచించారు.

ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీథ్రో ఎయిర్‌పోర్టు ఒకటి. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి ప్రయాణించేవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. OAG అనే సంస్థ గణాంకాల ప్రకారం.. కిందటి ఏడాది రద్దీ ఎయిర్‌పోర్టుల జాబితాలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. అయితే తాజా అగ్ని ప్రమాదంతో సోషల్‌ మీడియాలో ఈ ఎయిర్‌పోర్టుపై మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)