Breaking News

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

Published on Mon, 11/09/2026 - 08:34

ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేసిన ఆమె.. ఇప్పుడు వందలాది మంది పనిచేసే వ్యవసాయ క్షేత్రానికి ఉత్పత్తి మేనేజర్‌గా ఎదిగారు. అసలు ఆ దేశంలో బ్లూబెర్రీ సాగు అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియని సమయంలో ఓ చిన్న మొక్కను నాటారు. నేడు అదే సాగు పెద్ద వ్యాపారంగా మారింది. నమీబియాకు చెందిన లియోపోల్డిన్ మహోంగో ప్రయాణం మహిళా ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

నమీబియాలోని కవాంగో నది తీర ప్రాంతంలో 2019లో ఆమె తొలిసారిగా బ్లూబెర్రీ మొక్కలను నాటారు. అప్పటివరకు ఆ దేశంలో వాణిజ్యపరంగా ఈ పంటను ఎవరూ సాగు చేయలేదు. కొత్త పంట కావడంతో ఇది విజయవంతమవుతుందో లేదో కూడా ఆమెకు తెలియదు. అయినప్పటికీ ఎంతో ఉత్సాహంతో సాగు పనుల్లో పాల్గొన్నారు.

ఈ ప్రయత్నం క్రమంగా విజయవంతమైంది. దీంతో అంగోలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పెట్టుబడి నిధి (FSDEA) పెట్టుబడులతో అభివృద్ధి చెందిన మషారే బెర్రీస్‌ వ్యవసాయ క్షేత్రం ప్రస్తుతం సుమారు 60 హెక్టార్లకు విస్తరించింది. నామ్‌ బ్లూ పేరుతో బ్లూబెర్రీలను ఎగుమతి చేస్తోంది. పంట కోత సమయంలో వందలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.

తొలుత మొక్కలు నాటే కూలీగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మహోంగో.. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అదే వ్యవసాయ క్షేత్రానికి ఉత్పత్తి మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వేలాది బ్లూబెర్రీ మొక్కల సాగు, ఉత్పత్తి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారిలో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం.

వ్యవసాయ రంగంలో మహిళలు నాయకత్వ స్థానాలకు ఎదగడం ఈ ప్రాంతంలో చాలా అరుదు. అయితే, మొదటి నుంచి తన ఎదుగుదలను గమనిస్తున్న మహిళా కార్మికులకు మహోంగో స్ఫూర్తినిస్తున్నారు. తనను చూసి ఇతర మహిళలు కూడా బాగా పనిచేస్తున్నారని, ఒకరోజు తనలాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆశతో ముందుకు సాగుతున్నారని ఆమె చెబుతున్నారు.

చిన్న ప్రయత్నంతో ప్రారంభమైన బ్లూబెర్రీ సాగు ఇంత పెద్ద స్థాయికి చేరడం తనకెంతో గర్వంగా ఉందని మహోంగో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడం, పట్టుదలతో ముందుకు సాగడం ఒక వ్యక్తి జీవితాన్నే మార్చగలవని ఆమె ప్రయాణం నిరూపిస్తోంది. నమీబియాలో కొత్త పంటకు తొలి అడుగు వేసిన మహిళగా నిలవడమే కాకుండా.. వ్యవసాయ రంగంలో మరెంతో మంది మహిళలు ఎదిగేందుకు ఆమె మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. భారత్‌ కీలక నిర్ణయం?

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)