Breaking News

58 మంది పాక్ సైనికుల మృతి

Published on Sun, 10/12/2025 - 16:20

కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గంటగంటకూ ముదురుతున్నాయి. ఇరువైపులా భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. కాబూల్‌పై పాక్ కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తాము కాల్పులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతుండగా.. అకారణంగా ఆఫ్ఘన్ తమపై కాల్పులకు దిగిందని పాక్ వాదిస్తోంది. 

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రెండు సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అయితే.. తమ సేనలు జరిపిన కాల్పుల్లో 58 మంది పాక్ సైనికులు హతమయ్యారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. 30 మంది సైనికులు గాయపడ్డట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వైపు తొమ్మిది మంది సైనికులు మరణించగా.. 18 మంది గాయపడ్డట్లు ఆదివారం మధ్యాహ్నం కాబూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే.. పాకిస్థాన్ మాత్రం ఈ గణాంకాలను నిర్ధారించలేదు. తమవైపు ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు మృతిచెందినట్లు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) ప్రకటించింది. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముక్తకంఠంతో ఆఫ్ఘన్ చర్యలను ఖండించినట్లు పాక్ మీడియా తెలిపింది. తాలిబన్ సర్కారుకు గట్టి బదులిచ్చేందుకు పాక్ సైన్యం సిద్ధమైనట్లు వెల్లడించింది.

టీటీపీ లక్ష్యంగా డ్రోన్ దాడులు
తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వలీ మహ్సూద్ టార్గెట్‌గా పాక్ సైన్యం దాడులు జరుపుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు టీటీపీ సీనియర్ నేతలు మరణించగా.. వారిలో మహ్సూద్ ఉన్నారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రోన్ దాడులకు ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం పాక్ సరిహద్దుల్లో కాల్పులను ప్రారంభించింది. హెల్మాండ్ ప్రావిన్స్‌ లో రెండు పాకిస్థాన్ పోస్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కునార్, నంగర్హార్, హెల్మాండ్ ప్రాంతాల్లో భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.

రంగంలోకి ఇరాన్
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలను నిలువరించేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరువర్గాలు శాంతిని పాటించాలని పిలుపునిచ్చింది. ఘర్షణలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రకటించింది. సౌదీ అరేబియా, ఖతార్ కూడా ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరాయి. నిజానికి ఆఫ్ఘనిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా ఉంది. కేవలం రష్యా మాత్రమే తాలిబన్ల అధికారాన్ని, ప్రభుత్వాన్ని గుర్తించింది. తాజాగా భారత్‌లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి పర్యటన తర్వాత.. ఉపఖండంతో తాలిబన్ల మైత్రికి అడుగులు పడ్డాయి.

👉ఇదీ చదవండి: హమాస్‌ కొత్త బ్రాండ్‌ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు