Breaking News

పాక్‌పై అఫ్గాన్‌ భీకర దాడి.. 8 అవుట్‌పోస్టులు స్వాధీనం

Published on Tue, 03/03/2026 - 11:58

ఇస్లామాబాద్: సరిహద్దు వివాదంతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్‌-పాకిస్తాన్‌ల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. తాలిబన్ దళాలు అంతర్జాతీయ సరిహద్దు అయిన ‘డ్యూరాండ్ లైన్’ దాటి పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి, భీకర దాడులకు తెగబడ్డాయి. ఈ ఆకస్మిక దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఎనిమిది కీలక సైనిక అవుట్‌పోస్టులను అఫ్గాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అఫ్గానిస్థాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అఫ్గాన్ డిప్యూటీ ప్రతినిధి సెదిఖుల్లా నుస్రత్ వెల్లడించిన వివరాల ప్రకారం కందహార్ ప్రావిన్స్‌లో ఐదు, ఖోస్ట్‌లో రెండు, జబుల్ ప్రావిన్స్‌లో ఒక సైనిక పోస్టును అఫ్గాన్ దళాలు హస్తగతం చేసుకున్నాయి. ముఖ్యంగా స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో సరిహద్దు దాటిన అఫ్గాన్ సైనికులు మూడు పాక్ పోస్టులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ముగ్గురు పాక్ సైనికులను హతమార్చి, మరొకరిని సజీవంగా బందీగా పట్టుకున్నారు. వాయుసేన రంగంలోనూ పాకిస్తాన్‌కు చుక్కెదురైంది. సోమవారం ఒక్క రోజే అఫ్గాన్ దళాలు పాక్‌కు చెందిన నాలుగు డ్రోన్లను కూల్చివేశాయి.

జబుల్ ప్రావిన్స్‌లోని షాముల్జాయ్ జిల్లాలో లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఒక డ్రోన్‌ను అఫ్గాన్ సైన్యం నేలకూల్చగా, కందహార్ పరిసరాల్లో మరో డ్రోన్ కుప్పకూలింది. కాబూల్‌తో పాటు అఫ్గాన్ లోని ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్‌ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు చేపట్టినట్లు తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అఫ్గాన్ వైమానిక దళం పాకిస్తాన్‌లోని రావల్పిండి, క్వెట్టా, ఖైబర్‌ పఖ్తున్ఖ్వా తదితర కీలక ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు  చేసింది.

ఈ దాడుల్లో పాక్ సైనిక వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పక్తికా ప్రావిన్స్‌లోని అంగూర్ ఆదా బేస్ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక సాయుధ ట్యాంకును అఫ్గాన్ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. అఫ్గాన్ ప్రారంభించిన ఈ ఎదురుదాడిలో ఇప్పటివరకు 100 మందికి పైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, 30కి పైగా చెక్‌పోస్టులు అఫ్గాన్ వశమయ్యాయని సమాచారం. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పుల మోత కొనసాగుతుండటంతో పరిస్థితి  మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)