ఘోరం: బాంబుదాడిలో 9మంది చిన్నారుల మృతి

Published on Tue, 11/25/2025 - 12:39

అఫ్గానిస్థాన్‌ లో నిన్న అర్థరాత్రి జరిగిన బాంబుదాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఒక మహిళ మృతి చెందారు. ఈ దాడులకు పాకిస్థానే కారణమని అఫ్గాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్  తమ దేశంలోని పౌరుల ఇళ్లే టార్గెట్‌గా దాడి చేసిందని పేర్కొన్నారు.  కాగా ఈ దాడిపై పాక్  ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పాక్- అఫ్గాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పాకిస్థాన్ సేనలు తమ దేశంలోని కోస్ట్ ప్రావిన్స్ గుర్‌బుజ్ జిల్లాలోని ఓ పౌరుడి ఇంటిపై దాడి చేశాయని మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో 9 మంది చిన్నారులతో పాటు ఒక మహిళ మృతి చెందిందని తెలిపారు. అంతేకాకుండా కూనార్ తో పాటు మరో ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. కాగా నిన్న పాకిస్థాన్ పెషావర్‌లో పాక్ పారామిలటరీ కేంద్రం టార్గెట్‌గా దాడులు జరుగగా అందులో ఆరుగురు మృతిచెందారు. ఆ మరునాడే ఆప్గానిస్థాన్‌లో దాడులు జరుగడంతో ఈ ఘటన పాకిస్థాన్ చర్యేనని ఆప్గాన్ ఆరోపిస్తు్ంది.

అయితే ఈ దాడిపై పాకిస్థాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12మంది పౌరులు మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి వెనుకాడబోమని ఆ దేశ మంత్రి ఖవాజా ప్రకటించారు. ఈ బాంబుదాడులతో   ప్రస్తుతం రెండు దేశాల మధ్య సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.
 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)