Breaking News

BMW కారు బీభత్సం: భారత సంతతి గర్భిణి దుర్మరణం

Published on Wed, 11/19/2025 - 11:11

డ్రైవింగ్‌ సరిగ్గా రాకుండానే స్టీరింగ్‌ పట్టుకున్న ఒక మైనర్‌ అత్యుత్సాహం ఒక కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. రెండో బిడ్డ రాక కోసం కలలు కంటున్న నిండు గర్భిణి తన కల తీరకుండానే అనంత లోకాలకు చేరింది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 33 ఏళ్ల గర్భిణి భారతీయ మహిళ కన్నుమూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా అదుపు తప్పిన లగ్జరీ BMW కారు ఢీకొట్టింది. గత వారం ఈ విషాదం చోటు చేసుకుంది.

శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హార్న్స్‌బైలోని జార్జ్ సెయింట్ వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌పై వాకింగ్‌ చేస్తోంది ధరేశ్వర్‌.  వేగంగా వస్తున్న BMW కారు, ముందున్న కియా కార్నివాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కియా కారు ధరేశ్వర్‌ను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ధరేశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించినా, వారిని కాపాడలేక పోయామన్నారు. ఈ  ఘటనలో రెండు కార్ల డ్రైవర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ధరేశ్వర్ భర్త, ఆమె మూడేళ్ల బిడ్డ ఎలా ఉన్నారనే దానిపై సమాచారం లేదు. 

ఇదీ చదవండి: మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతి
నిందితుడు 19 ఏళ్ల P-ప్లేటర్ (తాత్కాలిక లేదా ప్రొబేషనరీ లైసెన్స్ ఉన్న డ్రైవర్) ఆరోన్ పాపాజోగ్లుగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్ నిరాకరించారు. కాగా మృతురాలు ధరేశ్వర్ IT సిస్టమ్స్ ఎనలిస్ట్‌గా ప‌ని చేస్తున్నారు. 

చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్‌మేన్‌కు దిమ్మ తిరిగింది
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)