సిరియాలో విధ్వంసం.. స్వదేశానికి బయలుదేరిన భారతీయులు

Published on Wed, 12/11/2024 - 07:28

డెమాస్కస్‌/బీరూట్‌: సిరియాలో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవతో దాదాపు 75 మంది భారతీయులు సిరియా నుంచి స్వదేశానికి బయలుదేరారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్‌ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరియాలో దారుణ పరిస్థితులు, దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిరియాను వీడాలని సూచించింది. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో, అక్కడున్న వారంతా స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.

సిరియా నుండి కనీసం 75 మంది భారతీయులు పప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. వారంతా మొదట సిరియా నుంచి లెబనాన్‌ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. డెమాస్కస్‌, బీరూట్‌ భారత రాయబార కార్యాలయాల ద్వారా పౌరుల తరలింపునకు సంబంధించి సమన్వయం చేసినట్టు వెల్లడించింది.

ఇక, ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు.. డమాస్కస్‌లోని దౌత్యకార్యాలయం ద్వారా తగిని సాయం పొందాలని కోరింది. ఈ క్రమంలో హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973, వాట్సాప్, ఈ-మెయిల్ hoc.damascus@mea.gov.in ద్వారా టచ్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)