Breaking News

లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి

Published on Sun, 11/03/2024 - 11:57

పెషావర్‌: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా బ్యాలెన్స్‌ తప్పి, లోయలో పడిపోయిన ఘటన వాయువ్య పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. 

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో ఒక బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అది అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో  మరో ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని ముష్కరులు రెండు వేర్వేరు భద్రతా దళాల కాన్వాయ్‌లపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారితో సహా 16 మంది సైనికులు గాయపడ్డారు. 

క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని సర్వేకై ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేశారని, 16 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారన్నారు. కరక్ జిల్లా నుంచి కాబూల్ ఖేల్‌లోని అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి కాన్వాయ్ తరలిస్తుండగా, లక్కీ మార్వాట్ జిల్లాలోని దర్రా తుంగ్ చెక్‌పోస్టు సమీపంలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
 

ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్‌.. దేశంలోని ప్రముఖ శివాలయాలు

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)