Breaking News

Nepal: ఆరుగురు భారత ట్రెక్కర్లు అదృశ్యం!

Published on Sun, 11/01/2026 - 10:48

ఖాట్మండు: నేపాల్‌లో భారీ హిమపాతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన షే ఫోక్సుండో సరస్సు సందర్శనకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆరుగురు భారతీయులు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. భారీగా మంచు కురుస్తుండటంతో వారి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. వారిని గుర్తించేందుకు అధికారులు గాలింపు, చర్యలు చేపట్టారు.

అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ పర్యాటకులు డోల్పో బుద్ధ గ్రామీణ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల నుంచి షే ఫోక్సుండో సరస్సు వైపు ప్రయాణమయ్యారు. షే ఫోక్సుండో గ్రామీణ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల మధ్య ఉన్న నుమ్లా పాస్, బగ్లా పాస్ ప్రాంతాల్లో వారు చివరిసారిగా కనిపించినట్లు సమాచారం. అప్పటి నుంచి వారి జాడ తెలియడం లేదు.

ఎత్తైన పర్వత ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న సమయంలో మంచులో చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానిక గైడ్లు అనుమానిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, పర్వత ప్రాంతాల్లో కఠిన పరిస్థితుల గురించి స్థానికులు ముందుగానే హెచ్చరించినప్పటికీ పర్యాటకులు తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆరుగురు భారతీయుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: విషవాయువు తీవ్రతకు నలుగురు హోటల్ సిబ్బంది మృతి!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)