Breaking News

కొత్తగా 59 వేల భారతీయులకు అమెరికా పౌరసత్వం

Published on Mon, 02/12/2024 - 09:04

గడచిన ఏడాది అంటే 2023లో 59 వేలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం దక్కింది. తాజాగా ‘అమెరికా పౌరసత్వం- 2023’ నివేదిక విడుదలయ్యింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2023లో అమెరికా 59,000 మందికి పైగా భారతీయులకు పౌరసత్వం ఇచ్చింది. 

అమెరికా పౌరసత్వం పొందడంలో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. మెక్సికో మొదటి స్థానంలో ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో (సెప్టెంబర్ 30, 2023తో ముగిసే సంవత్సరం) సుమారు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు యూఎస్‌ పౌరులుగా మారారు. వీరిలో 1.1 లక్షలకు మించిన మెక్సికన్లు, 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. 

యూఎస్‌ పౌరసత్వం మంజూరుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా వలస, జాతీయత చట్టం (ఐఎన్‌ఏ)లో నిర్దేశించిన నిర్దిష్ట అర్హతలకు అనుగుణంగా ఉండాలి.  కనీసం 5 సంవత్సరాలు చట్టబద్ధమైన శాశ్వత నివాసి (ఎల్‌పీఆర్‌)గా ఉండాలి. అలాగే అమెరికా పౌరులను జీవిత భాగస్వామిగా కలిగివుండడం,  లేదా మిలటరీ సేవలో ఉండడంతో పాటు పలు సాధారణ నిబంధనలు పౌరసత్వాన్ని పొందేందుకు అర్హతలుగా  ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2023లో అమెరికా పౌరసత్వం అందుకున్నవారిలో చాలా మంది ఐదేళ్ల చట్టబద్ద నివాసం ద్వారా అర్హత పొందినవారేనని నివేదిక వెల్లడించింది. అయితే అమెరికన్ పౌరులను పెళ్లి చేసుకున్నవారికి మూడేళ్ల వ్యవధికే అమెరికా పౌరసత్వం లభిస్తుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)