Breaking News

వీడియో వైరల్‌: న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో కాల్పుల కలకలం

Published on Sat, 08/09/2025 - 18:08

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్‌ స్క్వేర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా అలజడి రేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా.. వారిలో ఒక యువతి ఉన్నారు. వారిని  బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో గన్ క్రైమ్ తగ్గుతోందన్న పోలీస్ కమిషనర్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ ఘటనలు అమెరికాలో గన్ కల్చర్‌కు అమాయకులు బలైపోతున్నారు. గత నెల జులై 29న న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఆఫీస్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఎన్‌వైపీడీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా  పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో మే 27న ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్ పార్క్ కాల్పులు కారణంగా ఇద్దరు మైనర్లు మృతి చెందారుజ ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మెమోరియల్ డే సందర్భంగా జనసంచారం ఎక్కువగా ఉండగా.. రాత్రి 10:30 సమయంలో కాల్పులు జరిగాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)