Breaking News

ట్రంప్‌ టారిఫ్‌లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

Published on Wed, 08/05/2026 - 01:55

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌పై మరోసారి వ్యతిరేకత వ్యక్తమైంది. బలవంతపు చాకిరిని నియంత్రణ పేరుతో ట్రంప్‌ ప్రభుత్వం గత నెలలో 60 దేశాలపై విధించిన టారిఫ్‌లపై అమెరికాలోని 25 డెమొక్రటిక్‌ పార్టీ పాలిత రాష్ట్రాలు అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకు ఎక్కాయి. అమెరికా దిగుమతుల్లో సుమారు 99.4 శాతం వాటా ఉన్న ఉత్పత్తులపై ట్రంప్‌ ప్రభుత్వం 10 నుంచి 12.5 శాతం టారిఫ్‌ విధించిన విషయం తెలిసిందే.

భారత్‌పై మొదట 12.5 శాతం పన్ను విధించినప్పటికీ జూలై 14న తాము వాణిజ్య విధానంలో మార్పులు చేసి బలవంతపు చాకిరి కారణంగా ఉత్పత్తి అయిన వస్తువుల దిగుమతిని నిషేధించామని స్పష్టం చేయడంతో టారిఫ్‌ను పది శాతానికి పరిమితం చేశారు. ఈ పన్నులు వినియోగదారులతోపాటు వ్యాపారాలపై అదనపు భారం మోపుతాయని కోర్టుకు ఎక్కిన రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

ఈ పన్నులు అక్రమమని ప్రకటిస్తూ రద్దు చేయాలని డెమొక్రటిక్‌ పాలిత రాష్ట్రాల తరఫున వాదిస్తున్న న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటీషియా జేమ్స్‌ డిమాండ్‌ చేశారు. టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓటమి చవిచూసిందని, దీంతో ఇప్పుడు మరో రకంగా వ్యాపారాలపై టారిఫ్‌లను రుద్దేందుకు ప్రయత్నిస్తోందని అని జేమ్స్‌ వ్యాఖ్యానించారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)