Breaking News

కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు

Published on Mon, 12/15/2025 - 07:41

మాన్సా (పంజాబ్‌): కెనడాలోని ఎడ్మంటన్‌లో జరిగిన కాల్పుల ఘటన పంజాబ్‌లోని మాన్సా జిల్లా పరిధిలో గల  రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బార్రే గ్రామానికి చెందిన గురుదీప్‌ సింగ్ (27), ఉద్దత్ సైదేవాలాకు చెందిన రణ్‌వీర్ సింగ్ (19) గుర్తు తెలియని దుండగుల కాల్పులకు బలయ్యారు. ఉన్నత కెరీర్ ఆశయాలతో విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు హత్యకు గురికావడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ హత్యలు తప్పుడు గుర్తింపు కారణంగా జరిగి ఉండవచ్చు. మరో పంజాబీ యువకుని కారులోకి ఎక్కిన గురుదీప్‌, రణ్‌వీర్‌లపై దుండగులు కాల్పులు జరిపారు. 19 ఏళ్ల రణ్‌వీర్ గత మార్చిలో కెనడాకు వెళ్లాడు. అమెరికాలో అకౌంటెన్సీ వృత్తిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగ కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరైన తర్వాత ఎడ్మంటన్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు పార్టీలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడి మరో ఫ్రెండ్‌కు చెందిన కారులో డ్రైవర్ సీటులో కూర్చున్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. రణ్‌వీర్ మామ మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటనతో కుటుంబం షాక్‌లో ఉందని, కెనడియన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

ఈ ఘటనలో ‍ప్రాణాలు కోల్పోయిన మరో యువకుడు గురుదీప్‌ 2023లో కెనడాకు వెళ్లాడు. ట్రక్ మెకానిక్స్‌లో కోర్సు పూర్తి చేసి, ఉద్యోగ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. త్వరలో తన భార్య అమన్‌దీప్ కౌర్‌ను ఇక్కడికి తీసుకురావాలని ప్లాన్‌ చేసుకున్నాడు. గురుదీప్‌ మామ దర్శన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కారు యజమాని వెనుక సీట్లలో కూర్చోగా, రణ్‌వీర్, గురుదీప్‌ ముందు సీట్లలో కూర్చున్నారు. దీంతో దుండగులు తమ టార్గెట్‌కు భిన్నంగా గురుదీప్‌, రణ్‌వీర్‌లపై కాల్పులు జరిపివుంటారని  దర్శన్‌ సింగ్‌ అన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు తమ వారి మృతికి గల నిజమైన కారణం కోసం, నేరానికి సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)