Breaking News

అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్‌

Published on Sun, 11/09/2025 - 09:54

న్యూఢిల్లీ: విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత దేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఇద్దరిని అరెస్టు చేయడంలో భారత భద్రతా సంస్థలు  విజయాన్ని సాధించాయి. హర్యానా పోలీసులతోపాటు భద్రతా సంస్థ అధికారులు జార్జియాలో వెంకటేష్ గార్గ్‌ను అరెస్టు చేయగా, భాను రాణాను అమెరికాలో అరెస్టు చేశారు.

ప్రస్తుతం భారతదేశానికి చెందిన 25 మందికి పైగా  గ్యాంగ్‌స్టర్లు దేశం వెలుపల ఉన్నారు. వీరు క్రిమినల్ సిండికేట్‌లను నడుపుతున్నారని ‘ఎన్‌డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. గార్గ్, రాణాలను అరెస్టు చేయడానికి సాగించిన ఆపరేషన్‌లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని సమాచారం. గార్గ్.. హర్యానాలోని నారాయణ్‌గఢ్ నివాసి. ప్రస్తుతం జార్జియాలో ఉంటున్న గార్గ్‌పై భారతదేశంలో 10 కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలకు చెందిన  యువతను ప్రలోభపెట్టిన తన బృందంలో నియమించుకుంటాడు. గురుగ్రామ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నేత హత్య తరువాత అతను జార్జియాకు పారిపోయాడు.

గార్గ్ ప్రస్తుతం విదేశాలలో  ఉంటున్న గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో కలిసి దోపిడీ సిండికేట్‌ను నడుపుతున్నాడు. కాగా భాను రాణా .. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉంటూ, చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్నాడు. కర్నాల్ నివాసి అయిన రాణా చాలా కాలంగా నేర ప్రపంచంలో చురుగ్గా ఉన్నాడు. అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. రాణా నేర నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. 
పంజాబ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడి దర్యాప్తులో అతని పేరు బయటకు వచ్చింది.

ఇది కూడా చదవండి: 11న భూటాన్‌కు ప్రధాని మోదీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)