Breaking News

ఇరాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న 110 మంది విద్యార్థులు

Published on Thu, 06/19/2025 - 08:04

న్యూఢిల్లీ: ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి అర్మేనియాకుతరలించిన 110 విద్యార్థులు గురువారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. అర్మేనియా నుంచి ప్రత్యేక విమానంలో వారిని భారత్‌కు తీసుకొచ్చారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్‌ కావడంతో వారికోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ విద్యార్థుల్లో జమ్మూకశీ్మర్‌ నుంచే 90 మంది విద్యార్థులున్నారు. 

‘నా కుటుంబాన్ని కలవగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. ఇరాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యుద్ధం మంచిది కాదు. మానవత్వాన్ని చంపుతుంది’అని ఇరాన్‌ నుంచి వచ్చిన విద్యార్థి అమాన్‌ అజార్‌ అన్నారు. కాగా, ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థుల కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ‘నా కొడుకు ఇరాన్‌లో ఎంబీబీఎస్‌ చేస్తున్నాడు. నా కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వారి కృషికి ధన్యవాదాలు’అని రాజస్థాన్‌లోని కోట నుంచి వచ్చిన ఓ విద్యార్థి తండ్రి తెలిపారు.

 ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య వివాదం తీవ్రమవుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం తన పౌరులకు, ముఖ్యంగా విద్యార్థులకు భద్రత కల్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్‌ అభ్యర్థన మేరకు ఇరాన్‌ భూ సరిహద్దుల గుండా విద్యార్థులు సురక్షితంగా అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల గుండా బయటకు వెళ్లాలని సూచించింది. కాగా, ప్రస్తుతం ఇరాన్‌లో 4వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఇరాన్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.  



ఇది కూడా చదవండి: ఇరాన్‌పై దాడి ప్లాన్‌కు ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)