Breaking News

రోజూ వైన్‌, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ

Published on Sat, 03/14/2026 - 18:22

తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్‌నెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్‌స్టైల్‌, ఫుడ్‌ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం.   ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే  జిన్ బావోలింగ్‌ (Jin Baoling).

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్  కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి.  దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.

తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.

జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.

ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్‌లో సమృద్ధిగా ఉండే ఇది  చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట.  జిన్‌ దీన్ని దాదాపు ప్రతిరోజూ  తింటుంది. 

ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.

ప్రతీ పూట మందు ఉండాల్సిందే 
ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.

కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్‌కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్‌సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం  అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.

నెటిజన్లు స్పందన
తమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని  నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. 

“ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన  సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం.  నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)