Breaking News

రెండ్రోజుల్లో రూ.2 లక్షల  రుణమాఫీ ఏమైంది?

Published on Thu, 12/14/2023 - 09:09

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి  అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్‌ నోటితో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు.

వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, కాగ్‌ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్‌ రిపోర్ట్‌ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్‌ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)