Breaking News

దేశాన్ని అణుశక్తిగా మార్చిన మేధ

Published on Tue, 01/28/2025 - 09:56

దేశభక్తి, సంస్కృతీ సంప్ర దాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచా లన్న తపన కలిగిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్‌ రాజా రామన్న.  ఆయన 1925 జనవరి 28న సంప్రదాయ మైసూర్‌ అయ్యంగార్‌ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్‌సి.వి. రామన్‌ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించారు. ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు.

పన్నెండో ఏట మైసూర్‌ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 1949లో టాటా గ్రూపు– స్కాలర్‌షిప్‌పై లండన్‌ వెళ్ళి, అక్కడి ‘కింగ్స్‌ కాలేజి’ నుండి ‘న్యూక్లియర్‌ ఫిజిక్స్‌’లో డాక్టరేట్‌ తీసుకుని స్వదేశం తిరిగి వచ్చారు. డా‘‘ హోమీ భాభా ఆధ్వర్యంలో పని చేయడానికి 1952లో– టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో చేరారు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తరువాత కాలంలో భాభా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బీఏఆర్‌సీ: బార్క్‌)గా మారింది. 1960లలో అణ్వాయుధా లను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయ డంలో సాంకేతిక పరిశోధన చేపట్టారు. అప్పుడే మన దేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 

1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు–అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్‌లో ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ స్థాపించడానికి కార కులయ్యారు. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా‘‘ రామ న్నను బార్క్‌ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జన రల్‌గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరి గింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందను కుని, దేశభక్తుడయిన  రాజా రామన్న చెప్పా పెట్ట కుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.

చదవండి: ఈశ్వరాజ్ఞ

 

హోమీ జె. భాభా అకాల మరణం తర్వాత, ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లి యర్‌ ఫిషన్‌ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తిమంతమైన న్యూక్లియన్‌ రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవచ్చని– ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్‌కు డైరెక్టర్‌గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్‌ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్‌లతో పాటు అనేక పురస్కారాలు, పతకాలు, డాక్ట రేట్లు పొందారు.

రాజా రామన్న శత జయంతి (28 జనవరి 1925 – 28 జనవరి 2025) సందర్భంలో మనం ఉన్నాం. మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
(నేడు డా. రాజా రామన్న శతజయంతి)

-డా. దేవరాజు మహారాజు 

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)