Breaking News

యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ సీఎం) - రాయని డైరీ

Published on Sun, 11/08/2026 - 09:48

‘‘యోగీజీ, రాష్ట్రంలో కొన్నాళ్లపాటు మీరిక ఎన్‌కౌంటర్లను ఆపేయాలి’’ అన్నారు అమిత్‌ షా... నేనాయన పక్కనే నడుస్తూ ఉన్నప్పుడు. గతవారం రామ్‌ మనోహర్‌ లోహియా ‘లా’ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిశాక, ఆ ప్రాంగణంలో ఇద్దరం కలిసి నడుస్తున్నాం.

అమిత్‌ షాకు పక్కనున్నవారి భుజాల మీద చేయి వేసి నడుస్తూ మాట్లాడే అలవాటు లేదు కనుక, నేను కూడా ఆయన చేతులకు నా భుజాలు తాకనంత ఎడంగా నడుస్తూ ఆయనతో మాట్లాడుతున్నాను.
నిజానికి, ఆయనతో కలిసి నడవటానికి నేను ఆయన పక్కకు వెళ్లలేదు. నాతో కలిసి నడవటానికి ఆయనే నా పక్కకు వచ్చారు! అలా ఇద్దరం కలిసి నడుస్తున్నప్పుడే, ‘‘యోగీజీ, రాష్ట్రంలో కొన్నాళ్లపాటు మీరిక ఎన్‌ కౌంటర్లు ఆపేయాలి’’ అన్నారు అమిత్‌ షా! నేను మౌనంగా ఉండిపోయాను.

‘‘యోగీజీ, 2017లో మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు, ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 17,043 ఎన్‌ కౌంటర్లు జరిగాయని; సగటున చూస్తే రోజుకు 5 ఎన్‌ కౌంటర్లు, 12 రోజులకొక ఎన్‌కౌంటర్‌ ‘కిల్లింగ్‌’ అని– సరిగ్గా ఎన్నికలకు ముందు – పత్రికలు రాయటం మొదలుపెట్టాయి. కనుక కొన్నాళ్లు మీరు ఎన్‌ కౌంటర్లు ఆపేయటం అవసరం అనుకుంటున్నాను’’ అన్నారు అమిత్‌ షా.

400కు పైగా ఎన్‌ కౌంటర్‌లతో ‘కగార్‌’ ఆపరేషన్‌ ను విజయవంతంగా పూర్తి చేయించిన ఒక హోమ్‌ మినిస్టర్‌... కొన్నాళ్లపాటు ఎన్‌ కౌంటర్లు ఆపేయమన్నారంటే... ‘కొన్నాళ్లు’ అనే మాటకే తప్ప, ‘ఎన్‌ కౌంటర్లు’ అనే మాటకు ఎలాంటి ప్రాధాన్యమూ ఉండదు. మరో ఆర్నెల్లలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు. అమిత్‌ షా అంతక్రితమే కార్యవర్గ సమావేశంలో ఎన్నికల వ్యూహాన్ని ప్రకటించారు. 2027లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది మళ్లీ మన అభ్యర్థే అని అన్నారు.

సమావేశంలో కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌ ఉన్నారు. వాళ్లిద్దరూ ఉప ముఖ్యమంత్రులు కనుక వాళ్లలో ఒకరు యూపీకి కొత్త ముఖ్యమంత్రి కావచ్చు. సమావేశంలో ధర్మపాల్‌ సింగ్‌ ఉన్నారు. ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుక ఆయనా ముఖ్యమంత్రి అవొచ్చు. సమావేశంలో పంకజ్‌ చౌధరీ ఉన్నారు. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక ఆయనా ముఖ్యమంత్రి కాకూడదనేం లేదు.

సమావేశంలో వినోద్‌ తావ్డే ఉన్నారు. ఆయన రాష్ట్ర ఇంఛార్జ్‌ కనుక ముఖ్యమంత్రి ఎందుకౌతార్లే అనీ అనుకోవటానికి లేదు. అసలు వీళ్లెవరూ కాకుండా, మళ్లీ యోగీనే ముఖ్యమంత్రి కావచ్చని అనుకునేవాళ్లూ ఉండొచ్చు! అమిత్‌ జీ నా పక్కన నడుస్తున్నారు కనుక, మూడోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవటానికి నాకున్న తాజా అర్హత... అలా అమిత్‌ షా నా పక్కనే నడిచే అవకాశం నాకు రావటమేనని వారికి అనిపించవచ్చు.

అమిత్‌ షా తిరిగి ఢిల్లీ బయలు దేరుతున్నప్పడు లక్నో ఎయిర్‌ పోర్ట్‌లో కూడా ఆయనా, నేను కలసి నాలుగడుగులు నడిచాం. ఆ సమయంలో ఆయనా మాట్లాడలేదు, నేనూ మాట్లాడలేదు. మాట్లాడని ఇద్దరు మనుషుల మధ్య సాగే ‘సంభాషణ’ అపారమైనదిగా, అర్థవంతమైనదిగా ఉంటుంది.

అమిత్‌ షా మనసులో ఉన్నదేమిటో నాకు తెలుస్తూనే ఉంది. అక్టోబర్‌ 23న జరిగిన 11 ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ 6, సమాజ్‌వాదీ పార్టీ 5 సీట్లు గెలిచినా... వారణాసి పట్టభద్రుల సీటు, వారణాసి టీచర్ల సీటు బీజేపీకి రాలేదు. అవి రెండూ మోదీజీ నియోజకవర్గంలోనివి.

2024 లోక్‌సభ ఎన్నికల్లో 29 సీట్లు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 57 సీట్లు తగ్గటం కూడా అమిత్‌ షా మనసులో బలంగా ఉంది. ఆ తగ్గుదల 2027కు, 2029కి కొనసాగకూడదనుకుంటే, నేను కొన్నింటిని తగ్గించవలసి ఉంటుంది. లేదా, పూర్తిగా ఆపేయవలసి ఉంటుంది. అమిత్‌ షా చెప్పినట్లు అవి ఎన్‌కౌంటర్లైనా, బుల్డోజర్లైనా!!
- మాధవ్‌ శింగరాజు

ఇదీ చదవండి: నూరు వసంతాల భారతరత్నం

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)